22.8 C
Hyderabad

 నిజామాబాద్ ఎంసిహెచ్ నుంచి బాలుడి కిడ్నాప్

Boy kidnapped from Nizamabad MCH

Must read

📰 Generate e-Paper Clip

. . .  నిజామాబాద్ ఎంసిహెచ్ నుంచి బాలుడి కిడ్నాప్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి మూడేళ్ల బాలుడు మిస్సింగ్ అయ్యాడు . ఈ సంఘటన శనివారం జరిగింది. బాల్కొండ మండలం నాగేపూర్‌కు చెందిన సంధ్యారాణి–నరేష్ దంపతులకు నియాన్స్, వేదాన్ష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంధ్యారాణి మూడవ కాన్పు కోసం  నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి అనుబంధ ఎంసిహెచ్ కు వచ్చింది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వేదాన్ష్ (3) అదృశ్యం అయ్యారు. చాక్లెట్ ఇస్తానంటూ ఓ మహిళ బాలుడిని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తుండగా ,అన్న నియన్ష్‌ ముందే ఓ మహిళ వేదాన్ష్ తీసుకెళ్లేందని చెపుతుండటం గమనార్హం. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో బాలుడు ఎటువైపు వెళ్లాడన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. వేదాన్ష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. బాబు కనిపించకపోవడంతో భాధితులు 112 సమచారం అందించారు. నగర ఒకటవ టౌన్ పోలిసులు  ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Boy kidnapped from Nizamabad MCH
Boy kidnapped from Nizamabad MCH

నిజామాబాద్ జిజిహెచ్ నుంచి చిన్నారుల మిస్సింగ్ ఘటనలు చాలా జరిగాయి. కానీ నిజామాబాద్ ఎంసిహెచ్ లో బాలుడు కిడ్నాప్ జరుగడం తొలిసారి. ఆసుపత్రిలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి . మూడేళ్ల చిన్నారి ఎక్కడున్నాడన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. స్థానికంగా ఆర్ పి రోడ్డులో, బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డులో సిసి కేమోరాలను పరిశీలిస్తున్నారు.

Boy kidnapped from Nizamabad MCH
Boy kidnapped from Nizamabad MCH

More articles

Latest article