24.1 C
Hyderabad
Monday, August 3, 2026

వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 15 రోజులు ప్రాణాలతో పోరాడి మరణించిన బాలుడు

 

రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ :

 

రాజన్న సిరిసిల్లా జిల్లా లో వీధి కుక్కల దాడికి ఒక బాలుడు బలైపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మహేష్, సంగీత అనే దంపతుల కుమారుడు ఆదిత్య ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై దాడి చేసాయి. బాలుడి కాలుపై వీధి కుక్కలు దాడి చేస్తున్న సమయంలో ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు ఆదిత్య ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆదిత్య కింద పడిపోవడంతో తల కి బలమైన గాయం తగిలింది. ఆ గాయానికి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రూ.10 లక్షలు ఖర్చు చేసినా తమ కొడుకుని కాపాడుకోలేకపోయామని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article