నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఆర్మూర్ మున్నూరు కాపు పటేల్స్ వీధి, శివాజీ నగర్ లో బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక లో శివాజీ నగర్ లోని పోత లింగన్న టెంపుల్ నుండి ప్రతి ఇంటి నుండి బోనం తీయడం జరుగుతుంది. ఈ బోనాలు చిన్న పోత లింగన్న గుడి నుండి ప్రారంభం అయి పెద్ద పోత లింగన్న టెంపుల్ నుండి, బర్ది పోచమ్మ టెంపుల్, పెద్ద పోచమ్మ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ వద్ద బోనాలను సమర్పించారు. ఈ వేడుగ గత వంద సంవత్సరాలుగా సాంప్రదాయంగా వస్తుంది.
