Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 5:15 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల పండుగ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఆర్మూర్ మున్నూరు కాపు పటేల్స్ వీధి, శివాజీ నగర్ లో బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక లో శివాజీ నగర్  లోని పోత లింగన్న టెంపుల్ నుండి ప్రతి ఇంటి నుండి బోనం తీయడం జరుగుతుంది. ఈ బోనాలు చిన్న పోత లింగన్న గుడి నుండి ప్రారంభం అయి పెద్ద పోత లింగన్న టెంపుల్ నుండి, బర్ది పోచమ్మ టెంపుల్, పెద్ద పోచమ్మ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ వద్ద బోనాలను సమర్పించారు. ఈ వేడుగ గత వంద సంవత్సరాలుగా సాంప్రదాయంగా వస్తుంది.