ఢిల్లీ లో బాంబు పేలుడు

0 32,903

 

 వెబ్ డెస్క్, బతుకమ్మ :

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరుగడంతో సమీపంలోని కార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్  గేట్ నెంబర్ 1 సమీపంలో ఒక కారులో పెలుడు జరుగడంతో మూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనతో స్థానికంగా భీతవాహంగా పరిస్థితి నెలకొంది. దీంతో  ఫైరింజన్లు, అంబులెన్స్​లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటన లో కొంత మందికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాంబు పేలుడు ఘటనతో దేశ రాజ దానితో పాటు ఇతర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.