26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పట్టణంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం నాగారం సమీపం లోని నందిగుట్ట వద్ద గల చెరువు సమీపం లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించిందని సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యం.గంగాధర్ తెలిపారు. అనంతరం మృతదేహన్ని పరిశీలించి చూడగా రెండు, మూడు రోజుల నుండి నీట మునిగి ఉబ్బిపోయి ఉంటుందని, అతను తామర పువ్వు కోసం వెళ్ళి నీళ్లలో చిక్కుకుని మునిగినట్టు పైకి కనపడుతోందని అన్నారు. మృతుడు బ్లాక్ కలర్ టీ -షర్ట్, గ్రే కలర్ ప్యాంటు, బాక్సీ కంపెనీ డ్రాయర్, మొల దారం ధరించి ఉన్నాడని, అలాగే కుడి చేతిపై స్టీల్ బ్రాస్లెట్ ఉందని తెలిపారు. వయసు సుమారు 35 నుండి 40 వరకు ఉంటుందని అన్నారు. ఈ వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసినవారు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ని, లేదా 8712659727 నెంబర్ ని సంప్రదించాలని ఆయన కోరారు.

More articles

Latest article