ఏర్గట్ల, బతుకమ్మ: సమాజంలో నేను సైతం.. అనే ఆలోచనతో ఏర్పడినదే స్పందన ఫౌండేషన్ అని ఫౌండర్ నళిన్ ఇల్లెందుల అన్నారు. ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన తడ్ పాకల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం చేసే రక్త దానం ఇతరులకు ప్రాణదానమని, రక్తదానం చేయడం వల్ల నష్టమేమీ లేదని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు. స్పందన ఫౌండేషన్ ఫౌండర్ నళిన్ ఇల్లెందుల కోరిక మేరకు భవిష్యత్ లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ప్రాణధార సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ తెలిపారు. ప్రాణధార సొసైటీ సభ్యులు సుమన్, ప్రవీణ్ రక్తదాతలను సన్మానించిన అభినందించారు.
