బతుకమ్మ భిక్కనూరు : గణపతి నవరాత్రుల సందర్భంగా సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో సోమవారం శివాజీ సేన ఆధ్వర్యంలో మహా రాజా గణపతి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు . గణపతి హోమం సందర్బంగా గణపతి మండపం భక్తజనం తో కిటకిటలాడింది. భగవంతుడి ఆశీస్సులు ఉంటే ప్రతి వ్యక్తి అన్ని రంగాల్లో ముందుకు సాగుతారని రాఘవ పంతులు అన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ,శివాజీ సేన సభ్యులు పాల్గొన్నారు.

