కోటగిరి, బతుకమ్మ: శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సౌజన్యంతో కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఛత్రపతి శివాజీ నవసేన యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. శివాజీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హన్మంతు, శ్యామ్, జగన్, శివ శంకర్, కార్తీక్, శివరాం, సాయికుమార్, రెడ్ క్రాస్ సభ్యులు హన్మంతరావు, బర్ల రవి, వెంకటేశం, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
