29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పెన్షన్ అమలుకు డిమాండ్ చేస్తూ బీజేపీ రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత

 

పోతంగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కల్లూరి హనుమండ్లు (బజరంగ్) మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వయోవృద్ధులు, బీడి కార్మికులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళ, గీత కార్మికులు వంటి అర్హులకు పెన్షన్ పెంచి ఇవ్వాలని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, శంకర్, మక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

BJP to write demanding pension implementation

More articles

Latest article