పెన్షన్ అమలుకు డిమాండ్ చేస్తూ బీజేపీ రాస్తారోకో
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత పోతంగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కల్లూరి హనుమండ్లు (బజరంగ్) మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వయోవృద్ధులు, బీడి కార్మికులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళ,...