బండి- ఈటల వివాదంపై బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోవాలి

0 4,169

ఇందూర్ లో జెడ్పీ చైర్మన్ గెలవబోతున్నాం

ఇన్నేళ్లు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు..

ఏపార్టీకైనా కార్యకర్తలు కీలకం

తెలంగాణ రాజకీయాలపై డిల్లీలో ఎంపీ ధర్మపురి కీలక వ్యాఖ్యలు

డిల్లీ, బతుకమ్మ :  తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయనపార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. బండి సంజయ్- ఈటల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలన్నారు. బీజేపీ పాత, కొత్త అధ్యక్షుడు ఈఅంశం మాట్లాడాలని, అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలని అర్వింద్ హైకమాండ్ ను కోరారు. రాజా సింగ్ వ్యవహారంపై స్పందిస్తూ రాజాసింగ్ కొన్ని విషయల్లో మనస్తాపం చెందరాన్నారు. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ కాలేదని రాజీనామా చేశారన్నారు. మళ్లీ రాజాసింగ్ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్ట్ కాల్ ఇస్తే సరిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  బీసీ రిజర్వేషన్ల ముందుగా సుప్రీం కోర్టులో కోట్లాడాలని సూచించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చి పని చేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఫలితం చూపకపోతే పక్కకు పెట్టాలని వ్యాఖ్యనించారు. ఏపార్టీకైనా కార్యకర్తలు కీలకమన్నారు. ఇందూర్ జిల్లాలో  జెడ్పీ చైర్మన్  గెలువబోతున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.