ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా అని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అమిత్షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అంబేద్కర్ అంతక్రియలు ఢిల్లీలో కాకుండా బాంబేలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ అధినాయకత్వాన్ని అన్నారు. ఇష్టం లేకపోతే ఇలా అవమానించడం ఆ పార్టీకి పరిపాటే అని, అదే తరహాలో ఈ రాష్ట్రంలో కూడా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంతక్రియలను దేశ రాజధానిలో కాకుండా హైదరాబాదులో నిర్వహించారని అన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎప్పుడు కూడా దళిత నాయకునిగా కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఒక చాయ్ వాలా ఒక బీసీ బిడ్డ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు అంటే దానికి కారణం భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని నరేంద్ర మోడీ అనేక సార్లు చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని బిజెపి పార్టీ తమ అగ్ర నేతలు అవమానించడం అనేది అసాధ్యమన్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులంతా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, దీన్ని ఓర్వలేక ఇటువంటి కుట్రలను కుతంత్రాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది అని అన్నారు. ఇలాంటి కుతంత్రాలకు భయపడే పార్టీ బిజెపి కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్ ,సందీప్, కెప్టెన్ రాజు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
