27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ మధ్య సుమారు 35 వయస్సు గల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు. మృతురాలి మీద లేత ఆకుపచ్చ రంగు చీర ఉందని తెలిపారు. మృతురాలి సంబంధించిన వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి కోరారు.

More articles

Latest article