- వందల లక్షల కోట్లు దోచి, రెండు లక్షల కోట్లు తగ్గించి ఫోజులు కొడుతున్నారు
- జీఎస్టీ పెట్టమన్నది ఎవరు.. తగ్గించమన్నది ఎవరు..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : ముందెన్నడు లేని విధంగా దేశంలో జీఎస్టీ ని కొత్తగా అమలు లోకి తీసుకోచ్చి దేశ ప్రజలపై వందల లక్షల కోట్ల భారం వేసి, ఇప్పుడు నామమాత్రం జీ ఎస్టీ ని తగ్గించిన బిజెపి ప్రజలకేదో మెహర్బాని చేసినట్లు జబ్బలు కొట్టుకుంటూ, ఫోజులు కొడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన బతుకమ్మ తో మాట్లాడుతూ ఈ సంవత్సరం జీ ఎస్టీ పేరు మీద దేశ ప్రజల నుండి అక్రమంగా దోచిన రూ.22 లక్షల కోట్ల నుండి కేవలం రూ. 2 లక్షల కోట్లు మాత్రమే జీ ఎస్టీ తగ్గించి వాళ్ళు తొమ్మిదెండ్లలో దొచింది ప్రజలకు తెలియజేశారన్నారు. 9 ఏండ్లలో జీ ఎస్టీ పేరు మీద దేశ ప్రజల నుండి బలవంతంగా రూ. 100 లక్షల కోట్లు దోచి ఇప్పుడు కొంతమేర జీఎస్టి ని తగ్గించి ప్రజలకు మోడీ దసరా కానుక ఇచ్చారు అంటూ బిజెపి మొసలి కన్నీరు కారుస్తున్నదన్నారు. నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ నిన్న మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రతి వ్యక్తి కి నెలకు రూ.5000 మిగిల్చాము చెబుతున్నారని, అంటే…..గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా జీ ఎస్టీ పేరు మీద ధరలు పెంచి తెలంగాణ లోని ప్రతి వ్యక్తి నుండి నెలకు రూ.5000 చొప్పున మొత్తం రూ.5,40,000 రూపాయలు ఇదివరకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దోచుకున్నది అని ఒప్పుకున్నట్టే కదా అని అన్నారు. దీనికి బీజేపీ ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని ఇంకో బిజెపి ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ఇప్పుడు జీ ఎస్టీ తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.15000 మిగిల్చామని చెబుతున్నాడని, అంటే ఈ లెక్కన గడిచిన తొమ్మిది ఏండ్లుగా ప్రతి కుటుంబం నుండి నెలకు రూ.15000 రూపాయలు చొప్పున మీరు దోచుకున్నట్టేనా కాదా అని అన్నారు. అసలు ఎంపీలు దిమాక్ ఉండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారో తెలియదు కానీ మిమ్మల్ని జీ ఎస్టీ పెట్టుమని అడిగిన వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. 2017 సంవత్సరము నుండి కొత్తగా జీ ఎస్టీ పెట్టి….పప్పు, ఉప్పు, సబ్బు,నూనె,షర్ట్, పాయింట్, టివి,సైకిల్ మోటార్, కారు ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా? అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇవే మాయమాటలతో ప్రజలను మోసం చేస్తారు, మభ్యపెట్టాడతారని ఆయన అన్నారు. గత 9 ఏండ్లుగా జీఎస్టీ పేరుతొ ప్రజలను ఏ విధంగా దోచుకుంటు మోసం చేసారో..ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీ మీ మాట్లాల్లోనే ప్రజలు అర్థం చేసుకొన్నారని ఆయన ఏద్దెవా చేశారు. సమయం సందర్బం వచ్చినపుడు మీకు ఇదే ప్రజలు ఓట్ల కోతలు పెట్టడం మభ్యపెట్టిని మీకు వాతాలు పెట్టడం ఖాయమన్నారు.
