23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని  బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న   బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ బుధవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతుకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకు ల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, అమ్మ లక్ష్మీ నర్సమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అనంతరెడ్డి,మాజీ సర్పంచ్ పద్మ రెడ్డి,బీజేపీ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వరి,బీజేపీ నాయకులు,బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.

BJP District President Dinesh visits MLA Bhupathi Reddy

More articles

Latest article