స్థానిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను ఆదరించండి

0 14,942
  • సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు  బుర్రి ప్రసాద్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ వివిధ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు బుధవారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిత్యం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదరించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. బిజెపి నియంతృత్వ విధానాలతో పాటు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో వైఖరిని కొనసాగిస్తుందని అందువల్ల బిజెపిని ఓడించటానికి ప్రజలు సన్నద్ధం కావాలని అన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం ఉన్నచోట అభ్యర్థులను నిలబెట్టాలని మతోన్మాద శక్తులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తాము పోటీ చేయని చోట్ల ఓడించే శక్తులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుజర్పటంలో కూడా ప్రభుత్వం సరైన ఆలోచన చేయటం లేదని ఇప్పటికీ అయినా కాంగ్రెస్ పార్టీ  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపటంపై దృష్టి కేంద్రీకరించాలని లేనియెడల ప్రజలు తగిన  తీర్పును ఇస్తారని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యలపై స్పందించే వారిని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై  పోరాటం చేసే వారిని ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడిని తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా రాజ్యాంగం పైన  భారత న్యాయ వ్యవస్థ పైన దాడిగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు.  జస్టిస్ గోవా పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు నన్ను సబ్, సుజాత, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.