ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్
డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను ఇందూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...