31.4 C
Hyderabad

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీజేపీ అభ్యర్థి లింగు వినోద్ సాయం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో నివాస గృహంలో  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటి మొత్తం దగ్ధమై, వంట సామాగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి లింగు వినోద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితిని తెలుసుకుని, వారికి నెలకు సరిపడా వంట సామాగ్రితో పాటు రూ.5,000 నగదు, 50 కిలోల బియ్యం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా లింగు వినోద్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. జాప్యం లేకుండా బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయం అందించినందుకు బాధిత కుటుంబ సభ్యులు బీజేపీ అభ్యర్థి లింగు వినోద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article