29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పాఠశాలలో నీటి కొరత తీర్చేందుకు దాతల ముందడుగు

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామానికి చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు ముందుకు వచ్చారు. పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు పాఠశాల ఆవరణ వెలుపలికి వెళ్లాల్సి వస్తోందని, అలాగే నీటి కొరత కారణంగా కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా ఉంటున్నారని జూలై 14న బతుకమ్మ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన గ్రామానికి చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు సుమారు రూ.65 వేల వ్యయంతో పాఠశాలలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఇందల్వాయి సర్పంచ్ లోకాని గంగామణి – గంగారం, ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్ యూత్ వ్యవస్థాపకులు ఇట్టేడీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సమస్యను గుర్తించి తమవంతు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహాయం అందించి మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముందుకు వచ్చామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ అధ్యక్షుడు ఉప్పల్వాయి తరుణ్, ఉపాధ్యక్షుడు బైరి మదన్ మోహన్, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article