29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎక్సెల్ ను ఢీకొన్న బైకు: ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు మండలం బస్వాపూర్ సమీపంలో ప్రమాదం

 భిక్కనూరు, బతుకమ్మ:  మండలంలోని బస్వాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఎక్సెల్ ను బైక్  ఢీకొంది. ఈఘటనలో బస్సాపూర్ కు చెందిన వంక లింగం మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం లింగం తన వాహనం పై మెదక్ జిల్లా రామాయంపేట నుంచి బస్వాపూర్ వెళ్లే సమయంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన  స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా దవఖానకు తరలించారు. మృతుడి కుటుంబానికి కాలనీ వాసులు రూ. 10వేల ఆర్థిక సహాయం చేశారు. లింగం మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article