24 C
Hyderabad
Sunday, August 2, 2026

లక్ష్య సాధనలో భీమ్ గల్ మున్సిపాలిటీ ఫస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • 77 శాతం పన్నుల వసూళ్లు
  • కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : 2024-2025 ఆర్ధిక సంవత్సరం బకాయి పన్నులను 77 శాతం వసూలు చేసి భీమ్ గల్ మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి అభివృద్ధికి గాను మున్సిపాలిటీలు నిధులు పొందడానికి పన్నుల వసూళ్లల్లో ప్రభుత్వం లక్ష్యం పెట్టిన విషయం విధితమే కాగా ఆ లక్ష్యాన్ని సాధించినట్లు ఆయన సోమవారం వెల్లడించారు. గత ఆస్తి పన్ను లక్ష్యం పై 12.09 శాతం అధిక శాతం ఆస్తి పన్నును సిబ్బంది వసూలు చేసారని తెలిపారు. దాంతో జీఎస్డీపీ ప్రకారం ఫిఫ్టీంత్ ఫైనాన్స్ నిధులు భీమ్ గల్ మున్సిపాలిటీ అర్హత పొందినట్లు కమిషనర్ చెప్పారు. భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో గత యేడు 69 శాతం పన్నులు వసూలు చేయగా, ఈ యేడు 77 శాతం వసూళ్లు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా కమిషనర్ సిబ్బంది ని అభినందించారు.

More articles

Latest article