- మృతుడి కుటుంబానికి నగదు, బియ్యం వితరణ
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జోగుల నాంపల్లి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న భీమ్ యువత సభ్యులు 14516 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం అలాగే ఆదర్శ యూత్ సభ్యులు 3000 రూపాయల నగదు,50 కిలోల బియ్యంను కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో రేసు జగన్, కొప్పెలి రమేష్,గడ్డం జితేందర్, లింగాల సందీప్,గడ్డం వెంకటేష్, ఈసరి కిరణ్,కొత్త అరుణ్, బుర్క రాకేష్,ఈసరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
