ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలం కేంద్రంలో ఇందల్వాయి గ్రామంలో బిజెపి యువకులు గ్రామ యువత ఆధ్వర్యంలో దేశభక్తుడు భగత్ సింగ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు మెండే అశోక్, సీనియర్ నాయకులు గోపి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ముష్కరులను ఎదిరించి, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు.భగత్ సింగ్ త్యాగాన్ని నేటి విద్యార్థి లోకం తప్పక ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండల కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని,భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు.భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని మండల చౌరస్తా ఆవరణలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లోకాని గోపి, మండల ఉపాధ్యక్షుడు మేoడే అశోక్. బుట్టి ప్రసాద్,గంగిరెడ్డి రవి,అరుణ్,సందీప్.రాకేష్,ప్రణయ్.అశోక్.సతీష్,లడ్డు,చందు. తదితరులు పాల్గొన్నారు.