29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గోదావరిలోకి 4,50,000 క్యూసెక్కులు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 3,15,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. ఎస్సారెస్పీ 39 గేట్లను ఎత్తి గోదావరిలోకి 4,50,0000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. పరద కాలువ ద్వారా 500 క్యూసెక్కులు కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు సరస్వతి కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా ఆదివారం 1084.30 అడుగులు, 57.652 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

More articles

Latest article