ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలం కేంద్రంలో ఇందల్వాయి గ్రామంలో బిజెపి యువకులు గ్రామ యువత ఆధ్వర్యంలో దేశభక్తుడు భగత్ సింగ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు మెండే అశోక్, సీనియర్ నాయకులు గోపి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ముష్కరులను ఎదిరించి, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు.భగత్ సింగ్ త్యాగాన్ని నేటి విద్యార్థి లోకం తప్పక ఆదర్శంగా తీసుకోవాలని...