25.4 C
Hyderabad

భద్రాచలం ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

Bhadrachalam MLA's PA arrested.

Must read

📰 Generate e-Paper Clip

భద్రాచలం, బతుకమ్మ :

 

భద్రాచలం ఎమ్మెల్యే పీఏ ఉద్యోగాల పేరుతో 8 కోట్లు వసూళ్ళు చేసి ఆ డబ్బులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి . . చివరికి జైలుకు పోయాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకుని వాటిని తీర్చుకునేందుకు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు. మణుగూరు బీటీపీఎస్ సారపాక ఐటీసీ కంపెనీలలో ఉద్యోగాల పేరుతో 54 మంది నుంచి రూ. 8 కోట్లు వసూలు చేసిన నిందితుడు కోర్ల కళ్యాణ్ భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు,చర్ల తదితర ప్రాంతాల్లో నిరుద్యోగును మోసం చేశాడు. బాధితుడు రాయల శ్రీను ఫిర్యాదుతో భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేసే కేటుగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మోసాలు లేదా అనుమానాస్పద లింకుల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనీ సూచిస్తున్నారు.

More articles

Latest article