ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ మార్కులు

0 14,557

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థినిలు అత్యధిక మార్కులు సాధించారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలియజేశారు.  నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో  వెయ్యి మార్కులకు గాను ఎంపీసీ లో బి.జ్యోతిర్మయి 956 మార్కులు, బైపిసి లో మలిహ ఆర్ఫీన్ 974 మార్కులు, బైపిసి ఉర్దూ మీడియం లో 963 మార్కులు, ఒకేషనల్ ఆఫీస్  అసిస్టెంట్ షిప్  గ్రూప్ లో ఎస్. పూజ 974 మార్కులు సాధించారని తెలియజేశారు.  అలాగే ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బైపిసి రెండవ సంవత్సరంలో సోఫియా కుల్సుం 967 మార్కులు, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థిని ఎం.మనస్విని 932 మార్కులు సాధించారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.