27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాచారెడ్డి ఎస్ ఐ ఎస్.అనిల్

 

మాచారెడ్డి, బతుకమ్మ :

 

ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, మంచి లక్ష్యంతో చదువుకోవాలని, ఏ చిన్న కేసు అయినా జీవితాలు నాశనం అవుతాయని మాచారెడ్డి ఎస్ ఐ ఎస్.అనిల్ అన్నారు. మాదక ద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివిధ సామాజిక అంశాలపై మాచారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం మాచారెడ్డి ఎస్ ఐ ఎస్.అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో డైల్ 100 కి కాల్ చేయాలని, సైబర్ నేరాలపై 1930 నెంబర్ కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. షీ టీమ్ కి ఫిర్యాదు చేయాలనుకుంటే 8712686094 నెంబర్ కి చేయాలని పేర్కొన్నారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు, పిసి.సాయిలు మాటలు పాటలు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ పీసీ భూమయ్య, బ్లూ కోట్స్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, పీసీ గణేష్, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటాచారీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Be careful with social media.

 

More articles

Latest article