. . . నలుగురు నిందితుల అరెస్ట్
. . . భారీగా నగదు, బంగారం, వాహనాలు స్వాధీనం
బాన్సువాడ, బతుకమ్మ :
ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు మద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలో విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలు ఇటీవల పెరిగిపోయాయి. గుట్టు చప్పుడు కాకుండా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి ఉన్న రాగి తీగలు దొంగదించుకు పోతున్నారు. ఇటీవల పిట్లం, హంగర్గా, మద్నూర్, బిచ్కుంద, బీర్కూర్, ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాక్స్ ఫార్మర్ పగలగొట్టి రాగి తీగలు దొంగలించిన కేసులు వెలుగు చూశాయి. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుండి కాపర్ కాయిల్స్ ఆయిల్ను దొంగలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.ఈ నెల 8వ తేదీన మద్నూర్ మండలం పెద్దఎక్లారా గ్రామ సమీపంలో ఒక ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్ దొంగిలించిన ఘటనపై గ్రామ పంచాయతీ అధికారి మన్నే సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. తెలంగాణ (జుక్కల్) మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా సభ్యులు గతంలో నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడు పరిచయమయ్యారు. జైలు నుండివిడుదలయ్యాక సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దొంగతనాలకు తెరలేపారు. ఇప్పటివరకు మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లో దాదాపు 50కి పైగా ట్రాన్స్ ఫార్మర్లను వీరు ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది.అరెస్ట్ అయిన నిందితులు:కాంబ్లె సుభాష్, , అర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేలను అరెస్టు చేయగా పరారీలో ఉన్న అర్జున్ సకారం తాంబే, భీమ్ రావు అనే మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అరెస్టు అయిన వారి నుంచి 30,000 వేల నగదు, తులం బంగారం, :2 కార్లు, 1 తుఫాన్ వాహనం, 3 మోటార్ సైకిళ్లు, కత్తులు, కాపర్ కాయిల్ బెండ్స్ లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, పెద్దకొడపగల్ ఎస్సై అరుణ్ సీసీఎస్ బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
