సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి

  . . . మాచారెడ్డి ఎస్ ఐ ఎస్.అనిల్   మాచారెడ్డి, బతుకమ్మ :   ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, మంచి లక్ష్యంతో చదువుకోవాలని, ఏ చిన్న కేసు అయినా జీవితాలు నాశనం అవుతాయని మాచారెడ్డి ఎస్ ఐ ఎస్.అనిల్ అన్నారు. మాదక ద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివిధ సామాజిక అంశాలపై మాచారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం...