- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్న నేపద్యంలో నీటి నిల్వలు లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. చెరువుల క్రింది భాగంలో మత్తడి పోస్తుంది, కావున అటువైపు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమయితే తప్ప బయటకు వెళ్ళకుండ ఉండాలన్నారు. విద్యుత్ తీగలు తెగినచోట దూరంగా ఉండాలని, తమ పిల్లలను ఒంటరిగా, స్నేహితులతో ఈతకు పంపవద్దని, పిల్లల గురించి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, కంటికి రెప్పలా చూసుకోవలసిన భాద్యత తల్లిదండ్రులపైనే ఉందని సూచించారు. రోడ్డు పై చెట్లు విరిగి పడిపోవడం జరుగుతుంది. ప్రతీ ఒక్కరు వేళ్లే మార్గాంలో అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనాదారులు తప్పకుండా హెల్మేటు దరించాలని, ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వారు తమ పరిధిలోని సంబందిత పోలీస్ వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించగలరని తెలిపారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేయడానికి పోలీస్ సిబ్బంది ఎల్లవేళల సిద్దంగా ఉంటారని అన్నారు.
