భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్న నేపద్యంలో నీటి నిల్వలు లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. చెరువుల క్రింది భాగంలో మత్తడి పోస్తుంది, కావున అటువైపు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు....