నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో బిసి ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ వాయిదా వేసిన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు కార్యక్రమం ను నిర్వహించాలని కోరగా త్వరలో ఏర్పాటు చేద్దాం అన్నారు. బిసిటియు ఆధ్వర్యంలో జనవరి 5 వ తేదీన నిర్వహించే సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, బిసిటియు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్, సత్యనారాయణ, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
