రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 75 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి రోగులను గుర్తించి కంటి ఆపరేషన్ నిమిత్తం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్యాంసుందర్ పహడే, కేవీ.మోహన్, ప్రవీణ్, హనుమండ్లు, ప్రశాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
