27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సత్యాగ్రహ దీక్షకు బీసీ విద్యార్థి సంఘాల మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫీ రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

 

. . . బీసీ సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు మంగళవారం దీక్షా శిబిరానికి చేరుకుని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీ రీయింబర్స్‌ మెంట్ బకాయిలు సుమారు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బకాయిల విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. జూన్ 30న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 15న రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే మిగిలిన సుమారు రూ.7,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులను సంఘటితం చేసి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడతామని సత్యాగ్రహ దీక్ష వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్, శేఖర్, జనార్ధన్, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article