28.2 C
Hyderabad

14వ డివిజన్ లో పార్టీల కండువా వివాదం

Controversy over party scarves in the 14th division

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . . మేయర్ సమక్షంలోనే డివిజన్ ఇంచార్జిని నెట్టివేసిన ఎంఐఎం నాయకులు

 

. . . శంకుస్థాపన ప్రోగ్రాం లో మజ్లిస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర పాలక సంస్థలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య డెవలప్ మెంట్ కార్యక్రమంలో జరిగిన వివాదం రచ్చకెక్కింది. మేయర్ పాల్గొన్న ప్రోగ్రాంలో అధికార పార్టీకి చెందిన నేత పార్టీ కండువా వేసేందుకు యత్నించగా మజ్లీస్ పార్టీ నాయకులు అడ్డుకుని నెట్టివేయడం వివాదాస్పదమైంది. మేయర్, మేయర్ భర్త కాంగ్రెస్ నాయకుడి ఎదుటనే ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ డివిజన్ ఇంచార్జిని తోసివేయడం గొడవ కారణమైంది. నగరంలో అధికార కాంగ్రెస్, మిత్రపక్షం మజ్లిస్ మధ్య పార్టీ కండువాల కోసం వివాదం జరిగింది. అభివృద్ధి పనులు ప్రారంభం కోసం వచ్చిన మేయర్ కు కాంగ్రెస్ కండువా వేయడం పై పతంగి పార్టీ నాయకులు అడ్డుకున్నారు. డివిజన్ ఇంచార్జిని నెట్టి వేశారు. ఈ సంఘటన శనివారం నగరం లోని 14వ డివిజన్ లోని ఎన్ఆర్ఐ  కాలనీ జరిగింది. నగర మేయర్ ఉమారాణి 20 లక్షల రోడ్డు పనులు శంకుస్థాపన కు వచ్చారు. అక్కడ స్థానిక డివిజన్ ఇంచార్జ్ వాహేద్ మేయర్ కు పార్టీ కండువా వేసారు. డివిజన్ కార్పొరేటర్ ముంతాజ్ అలీ,మజ్లిస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసారు. కొందరు నాయకులు వాహేద్ ను నెట్టివేశారు. దానితో మేయర్ భర్త రమేష్ కు మజ్లిస్ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది.అది కాస్త ఇరు వర్గాల మధ్య తోపులటాకు దారి తీసింది. చివరకు ఇరు పార్టీల నేతలు కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. అయితే అధికార పార్టీ నాయకులను మిత్రపక్షంగా కలుపుకొని వెళ్లకుండా తోసివేయడంపై కాంగ్రెస్ నాయకులు గరమయ్యారు. మేయర్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఎంఐఎం తీరుపై కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మండిపడ్డారు. మజ్లీస్ పార్టీ కావాలని మైనార్టీ డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ లీడర్లను, కార్యకర్తలను అణచివేసేందుకు యత్నిస్తుందని దానిని సహించేది లేదని తేల్చిచెప్పారు. ఉదయం జరిగిన వివాదం సాయంత్రానికి మరింత రాజుకుంది. భవిష్యత్తులో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య డివిజన్ లలో గొడవలకు ఆస్కారం ఉందని చర్చ జరుగుతుంది.

More articles

Latest article