24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆడపడుచుల ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మలో కనిపిస్తాయి

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ కావడంతో బతుకమ్మ పండగను తొమ్మిది రోజులు ప్రతి పల్లెల్లో పట్టణాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా రంగ రంగ వైభవంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా మహిళలు నిర్వహిస్తారని తెలపడంలో అతిశయోక్తి లేదు. పండగ వచ్చిందంటే పువ్వులు అన్ని ఏకమై బతుకమ్మను పేర్చినట్టుగా ఆడపడుచులంతా ఐక్యతతో ఏర్పడి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారని చెప్పడంలో సందేహం లేదు. బతుకమ్మ సంబరాలపై బతుకమ్మ ప్రత్యేకత కథనం.
ప్రతి మహిళలో ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయత, భక్తి కనిపిస్తాయి..
బతుకమ్మ పండుగ సంబరాల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు, మేలవిస్తారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మ పండుగ.
రకరకాల పూలతో..
రకరకాల పువ్వులతో రంగు రంగులతో గునుగు పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి, నందివర్ధనం, మందార లాంటి రకరకాల పూలన్నిటిని సేకరించి వాటి అన్నింటినీ కలిపి పూలతో కీర్తిస్తూ బతుకమ్మను వలయకారంగా పేర్చుకుంటూ ఆకర్షనీయంగా బతుకమ్మను తయారుచేసి మధ్యలో పసుపు తో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో ప్రత్యేకముగా అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయట తీసుకెల్లి అందరూ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఊరేగింపుగా తీసుకువెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
చిన్ననాటి స్నేహితులందరం కలుసుకుంటాం
తిరుమల దేవి, ఎంపీడీవో, మోర్తాడ్
బతుకమ్మ సంబరాలు ప్రారంభమైనాయి అంటే చాలు గ్రామంలో చిన్ననాటి స్నేహితులు అందరూ కలుసుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తాం. సద్దుల బతుకమ్మ రోజు ప్రతి ఒక్కరం తమ సొంతగా పువ్వులు సేకరించి బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించుకుంటాం. బతుకమ్మ సంబరాలు చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటాం.

Bathukamma is a proof of the unity of women
మా కాలనీలో తొమ్మిది రోజులు
లక్ష్మీ దుర్గ, పంచాయతీ కార్యదర్శి, సుంకేట్.
బతుకమ్మ సంబరాలు రాగానే అందరూ సంతోషంగా ప్రతిరోజు సాయంత్రం రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తాము. చివరి రోజు అందరి ఇండ్లలో నుంచి రకరకాల పిండి వంటలు తెచ్చుకొని ఒకరికొకరం పంచుకుంటూ తింటూ సంతోషంగా గడుపుతారు.

Bathukamma is a proof of the unity of women

More articles

Latest article