24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జిజి కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండగని, ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులతో బతుకమ్మను ఆరాధించే స్త్రీలకు ప్రత్యేకమైన పండుగని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. ఎస్. రంగరత్నం మాట్లాడుతూ తెలంగాణాలో కాకతీయుల కాలం నుండి వస్తున్న ఈ బతుకమ్మ పండుగ  తెలంగాణకు విశిష్టమైనటువంటిదని, మన కళాశాలలో  విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల  కళాశాలలో బతకమ్మ

Bathukamma celebrations in grand style at GG College

ఉత్సవాలు ప్రతి సంవత్సరం గొప్పగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఎన్.ఎస్.ఎస్. విభాగాలు, కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని పి.ఆర్.వో. డాక్టర్ దండు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ నహీదా బేగం,ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్  రజిత, నాగజ్యోతి, దస్తప్ప, వెంకట రమణ, నరేశ్ కుమార్, సుధాకర్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రంజిత, ప్రతిభ, నవీన, లావణ్య, శ్రీలేఖ, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, కార్యాలయ ఉద్యోగులు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Bathukamma celebrations in grand style at GG College

More articles

Latest article