26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బతుకమ్మ పండగ ఏర్పాట్ల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో జరిగే సద్దుల బతుకమ్మ పండగ కోసం ఏర్పాట్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. గిద్దె చెరువు ఎంట్రన్స్ లో, గిద్దె చెరువు వద్ద లైట్స్ ను, అదే విధంగా పల్లె ప్రకృతి వనంలో సైతం లైట్స్ ఏర్పాటు చేయాలని, గ్రామం లో మహిళలు బతుకమ్మ ఆడే ప్రతి చోట బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించి అవసరమగు చోట డే లైట్స్ బిగించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇంకా బతుకమ్మ పండగ ఏర్పాట్ల కోసం ఏమైనా అవసరాలు ఉంటే నేరుగా గ్రామ పంచాయతీ పిర్యాదుల రిజిష్టర్ లో పేర్కొనాలని ఆయన గ్రామ ప్రజలకు సూచించారు. ఎంగిలి పూల బతుకమ్మ పండగ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో ఉన్న బతుకమ్మ ఘాట్ లో వేసిన బతుకమ్మలను సిబ్బందితో తొలగించి బతుకమ్మ ఘాట్ ను శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆంజనేయులు ఉన్నారు.

More articles

Latest article