జిజి కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండగని, ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులతో బతుకమ్మను ఆరాధించే స్త్రీలకు ప్రత్యేకమైన పండుగని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. ఎస్. రంగరత్నం మాట్లాడుతూ తెలంగాణాలో కాకతీయుల కాలం నుండి వస్తున్న ఈ బతుకమ్మ పండుగ తెలంగాణకు విశిష్టమైనటువంటిదని, మన కళాశాలలో విద్యార్థినుల సంఖ్య...