పిసమల్లన్న ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు

0 1,299

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పిస్సమల్లన్న ఆలయం వద్ద టెక్నో సాఫ్ట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్  ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మంగళవారం  ఘనంగా నిర్వహించారు.  విద్యార్థినిలు,ఇ న్స్టిట్యూట్ ఫెకాల్టీ రంగురంగుల పూలతో త్రివర్ణకారంలో బతుకమ్మని పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.  ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థపాక అధ్యక్షులు మాట్లాడుతూ బతుకమ్మ పండగ కొన్ని దశాబ్దల నుండి జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తేవడం జరిగిందని  తెలిపారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు.  నాటిటి కాలంలో నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవని తెలిపారు. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారని పేర్కొన్నారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” పాటల వెనుక ఉండే మర్మం ఇదేయే అని నివేదన్ కొనియాడారు.  ఈ కార్యక్రంలో టీచర్స్ ఇశ్వరీ,శ్రేయ,అన్నపూర్ణ,మరియు విద్యార్థినిలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.