30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సైబర్ మోసానికి బస్వాపూర్ వాసి బలి

Must read

📰 Generate e-Paper Clip

  •  7. 20 లక్షలు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి లబోదిబోమంటున్న బాధితుడు 
  •  1930 సైబర్ క్రైం కు కాల్ చేసి ఫిర్యాదు 

బతుకమ్మ భిక్కనూరు :  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒకరు డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఫోన్ లో  ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తుండగా లాటరీ కనిపించడంతో క్లిక్ చేశాడు. వెంటనే 9725367990 నెంబర్ ద్వారా వాట్సాప్ కాల్ అతని ఫోన్ కు వచ్చింది. 60 లక్షల రూపాయలతో పాటు, 10 తులాల బంగారం, ఒక ఐఫోన్ లాటరీ ద్వారా పొందవచ్చని చెప్పారు. దీంతో అర్ధరాత్రి శ్రీమంతుడు కావచ్చన్న ఆశతో, వాళ్ళు చెప్పినట్టు టాక్స్ కింద కొంత డబ్బు ముందుగా చెల్లించాలని సూచించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా  తన యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 0276100007240 నుంచి, ఫోన్ పే లింకు ఉన్న 9966396930 నెంబర్ ద్వారా,9509862810,9828589326,9057845886, నెంబర్లకు 90 వేల ఒక వంద రూపాయల ను ఈనెల 4 వ తేదీ నుంచి నుంచి ఏడవ తేదీలోగా పంపించాడు. ఇంకా కొంత టాక్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో, మెదక్ జిల్లా రామయంపేట వెళ్లి  ఎస్ బీఐ బ్యాంకు నుంచి మరో 95 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయించాడు.9 వ తేదీన మరో ఖాతా నుంచి హిమత్ రామ్ ఎస్బిఐ బ్యాంక్ ఖాతాకు 38696107462 (టాక్స్ ఐడి ఖాతా 200481077) గల ఖాతాలో2 లక్షల 35 వేల రూపాయలు రామయంపేటలోని ఎస్ బి ఐ బ్యాంకు నుంచి ఆ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించాడు. 10 పదవ తేదీ నాడు లక్ష రూపాయలు( టాక్స్ ఐడి జే ఆర్ నెంబర్ 347947045), మరో 2 లక్షల రూపాయలు(24036 5957 ) అతని బ్యాంక్ ఖాతా 43534543269 ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్0032115 కైలాష్ పేరున ఉన్న జోద్పూర్ బ్రాంచ్ కు, ఈ మొత్తం డబ్బును ఎస్ బీ ఐ భిక్కనూరు బ్రాంచ్ నుంచి డబ్బులు జమ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మోసపోయావని గుర్తించారు. వెంటనే 1930  సైబర్ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. 7 లక్షల20 వేల వంద రూపాయలు మోసపోయాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ కింద అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

More articles

Latest article