28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసుల సేవలు ఆమోఘం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ పోలీస్ కానిస్టేబుల్ ల సేవలు అమోగం అని చెప్పవచ్చు.. కోటగిరి మండలం కారేగాం గ్రామానికి చెందిన నరహరి లలిత అనే మహిళ స్వగ్రామానికి వెళ్లడానికి బాన్సువాడలో బోధన్ బస్సు ఎక్కింది. రుద్రూర్ లో బస్సు దిగిన ఆమె తన 40వేల రూపాయలు, బంగారం ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. బస్సు వెళ్లిపోవడంతో వెంటనే ఆమె రుద్రూర్ చౌరస్తాలో ఉన్న కానిస్టేబుళ్లు సురేష్, గజేందర్, డైవర్ శ్రీనులకు జరిగిన విషయం వివరించింది. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు బస్సును వెంబడించి బ్యాగును తీసుకువచ్చి బాధితురాలు నరహరి లలితకు అప్పగించారు. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్ఐ పి. సాయన్న అభినందించారు. దింతో బాధితురాలు కానిస్టేబుల్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article