బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత ప్రాథమిక పాఠశాల బ్రాహ్మణ పల్లి , చిల్లర్గీ, హరిజనవాడ చిల్లర్గి పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు, బేస్ లైన్ టెస్ట్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారా లేదా పరిశీలించారు, ఉపాధ్యాయుల సివిల్ లిస్టు ఫోటోలతో సహా కూడినది ప్రదర్శించబడేలా చూడాలని సూచించారు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. యూనిఫామ్ టెస్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ మొదలైనవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, హేమలత, ఇస్మాయిల్, సిబ్బంది విటల్, గంగాధర్, విజయ, ఆ ప్రాంత రిసోర్స్ పర్సన్ గోపాల్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

