బతుకమ్మ, బోధన్ : బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మందకృష్ణ జన్మదిన వేడుకలు ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగా మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని, బహుజనుల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ మండల సీనియర్ నాయకులు, గంధమాల చంద్రయ్య మాదిగ, సాలూరు మండల అధ్యక్షులు బూరె శంకర్ మాదిగ, కెస్నర్ మోహన్ మాదిగ, బండారి గంగాధర్ మాదిగ, రెడ్ సాయిలు, రవి, విన్నోద్ తదితరులు పాల్గొన్నారు.
