. . . స్వచ్ఛందంగా మూసి ఉంచిన దుకాణాలు…
బాన్సువాడ బతుకమ్మ :
బాన్సువాడ పట్టణ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మాట్లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా రాస్తారోకో చేపట్టారు.మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి ఆందోళనను విరమింప చేశారు. దీంతో శనివారం హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ముగ్గురు డీఎస్పీలు 20 మంది సిఐలు 30 మంది ఎస్ఐలు 200 మంది పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,బాన్సువాడ డీఎస్పి విట్టల్ రెడ్డి, పట్టణ సీఐ తూల శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్యలు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు.

