. . . ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
… కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.ఆర్ హౌస్ అరెస్ట్
… కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసిన బిజెపి కార్యకర్తలు
. . . కామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు తరలింపు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.. కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చ వేదిక హిట్ పుట్టించింది.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం 163 సెక్షన్ అమలు చేస్తున్నారు..

పో లీసులు ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.. కాంగ్రెస్ తన ఫై అవినీతి ఆరోపణలపై శిశుమందిర్ వద్దకు చర్చకు రావాలని ఎమ్మెల్యే కె.వి.ఆర్ సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. ఎమ్మెల్యే కె.వి.ఆర్ నో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి అనుచరులతో వచ్చిన కాంగ్రెస్ నేత కారును బిజెపి కార్యకర్తలు అడ్డుకొని ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి తాడువాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన బహిరంగ చర్చ వివాదం మళ్లీ పునరావృత్తమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
..
