నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణ ఫీల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే నియమితులైన దిల్ రాజ్ ను అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్ బుధవారం హైద్రాబాద్ లో కలిశారు. ఈ సందర్బంగా దిల్ రాజ్ కు శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. దిల్ రాజ్ ను కలిసిన వారిలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్ లు ఉన్నారు.
