29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : రోడ్డు దాటుతున్న మహిళను అతివేగంతో వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వరనగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడ్డెంగారి సిద్ధవ్వ(48) సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అటువైపుగా వెళ్తున్న ప్రమాదాన్ని చూసి తీవ్రంగా గాయపడిన మహిళను అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.

A woman died after being hit by a private bus

More articles

Latest article